రిపబ్లిక్ సినిమాను చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవా కట్టా మాట్లాడుతూ “సినిమా ఎమోషన్ అనేది బరువుగా ఉన్నప్పుడే దానికి మనం కనెక్ట్ అవగలం. ఈ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. విమర్శకులు సైతం సినిమా మీద ప్రశంసలు కురిపించారు”అని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఒక ప్రాంతంలోని సమస్యను మాత్రమే చూపించి ప్రశ్నలను మాత్రం అన్ని వ్యవస్థలపై వేసినట్టుగా దేవా కట్టా తెర్కెక్కించారు. ప్రజలకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొద్ది మందిలోనైనా మార్పు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. దేవాకట్టా ఓ మంచి సినిమా తీశారు”అని పేర్కొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews