దమ్మున్న నాయకుడు దొరికాడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు -జానారెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్‌కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఏడేళ్లుగా కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఉందని మధుయాష్కీగౌడ్‌ అన్నారు.గజ్వేల్‌ సభను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్, సంభాని చంద్రశేఖర్, జాఫర్‌ జావేద్, జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews