కొడంగల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. కొడంగల్‌లో ఆరు నామినేషన్లు రాగా, ముగ్గురికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. నాలుగో స్థానంపై ఉత్కంఠ నెలకొన్నది.కొడంగల్‌ మున్సిపాలిటీలో ఆరు నామినేషన్లు దాఖలుకాగా టీఆర్‌ఎస్‌కు చెందిన సయ్యద్‌ మునీర్‌, శారదమ్మ, హజీరాబేగం పేర్లు ఇప్పటికే ఖరారుకాగా, నాలుగో కో-ఆప్షన్‌ స్థానం కోసం రమేశ్‌బాబు, కోస్గి వెంకటయ్య మధ్య పోటీ నెలకొన్నది. అయితే, రమేష్‌ బాబుకు స్థానిక ఎమ్మెల్యే మద్దతుండగా, కోస్గి వెంకటయ్యకు మాజీ ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. మరోవైపు నామినేషన్‌ వేసిన ఫకీరప్ప పోటీ నామమాత్రమేనని స్పష్టమవుతున్నది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews