కష్టాలో వున్న వలసదారులకు మరియు ఉద్యోగాలకు యాప్ విడుదల చేసిన సోనూసూద్

వలస జీవులను సొంతూళ్లకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలసదారులకు సహాయం చేయడానికి తాజాగా సోనూసూద్‌ యాప్‌ను లాంచ్‌ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడంలో కార్మికులకు సహకారం అందించేలా రూపొందించిన యాప్‌ను సోనూసూద్‌ బుధవారం ఆవిష్కరించారు. కరోనా లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన సోనూసూద్‌ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. కార్మికుల కోసం ‘ప్రవాసీ రోజ్‌గార్’‌ పేరుతో ఉచిత్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను విడుదల చేశారు. యాప్‌లో ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు సరైన ఉద్యోగాలను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. రోజ్‌గార్‌ యాప్‌ ఇంగ్లీష్‌ నేర్చుకోవడం వంటి జాబ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లను కూడా అందించనుంది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews