వికారాబాద్ లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం వలన ముగ్గురు మృతి

రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద 12 మంది రైల్వే సిబ్బంది ట్రాక్‌కు పెయింటిగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నుండి రైలింజన్ వికారాబాద్ వైపు వచ్చింది. ట్రాక్‌పై పనులు చేస్తున్న సిబ్బందికి ఎలాంటి సమాచారం లేదు. దగ్గరికి వచ్చిన తరువాత రైల్వే ఉద్యోగులు గమనించారు. ట్రాక్‌పై నుండి తప్పుకునే క్రమంలో ముగ్గురిని రైలింజన్ ఢీ కోట్టింది. ఈ ముగ్గురు సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఘటన స్థలాన్ని రైల్వే ఉన్నతాధికారులు, వికారాబాద్ జిల్లా ఎస్పీ పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచార లోపం వల్లే ముగ్గురు చెందారని, ఇది మమ్మాటికి రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews