“భగవద్గీత సాక్షిగా” మెగా హీరో కొత్త సినిమా

మెగా హీరో సాయితేజ్ కొత్త సినిమాకు ’భగవద్గీత సాక్షిగా…అని టైటిల్ పెట్టనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. చిత్రలహరి ప్రతి రోజు పండుగే తో సాయితేజ్ వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సోలో బ్రతుకే సో బెటరుసినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దేవకట్టా రూపొందించే మరో సినిమాలో నటించేందుకు సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఇంకో సినిమాలో నటించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు సాయితేజ్ కు కథ వినిపించారని, ఆ కథ సాయితేజ్ కు బాగా నచ్చడంతో నటించేందుకు అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. కొత్త కథను వినిపించిన సదరు దర్శకుడిని తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి వద్దకు సాయితేజ్ తీసుకెళ్లాడని, చిరుకు ఈ కథను వినిపించారని, క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేయాలని ఆయన సూచించారని వార్తలు వస్తున్నాయి. చిరు సూచనలతో కథ క్లైమాక్స్ లో మార్పులు చేసే పనిలో సదరు దర్శకుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews