నాగబాబు ముద్దుల కూతురు నిహారికపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు నీకు బాధ్యత ఉందా అంటూ మండి పడుతున్నారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతగా నిహారిక ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా? చైనా ప్రొడక్ట్ అయిన ఒన్ ప్లస్ ఫోన్‌కు ఆమె ప్రమోషన్ చేసింది. ఆ ఫోన్‌కు బ్రాండింగ్ చేస్తూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టు నెటిజన్ల ఆగ్రమానికి గురైంది. ఓ వైపు దేశమంతా చైనా వస్తువులను నిషేధించాలన్న పిలుపు జోరుగా సాగుతుంటే నువ్వు మాత్రం ఇలా ప్రమోట్ చేస్తున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తన మీద ఫైర్ అవుతున్న నెటిజన్లకు నిహారిక ఎలా సమాధానమిస్తోందో చూడాలి.