చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదు. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేసే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఝు ఝురున్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రభుత్వ విధానాలు తప్పుడువని ప్రొఫెసర్ ఝు ఝురున్ బహిరంగ విమర్శలు చేశారు. దీంతో అతడిని అరెస్టు చేసి వారం పాటు జైలులో ఉంచారు. సోమవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కరోనాను నియంత్రించడంలో చైనా ప్రభుత్వం విఫలమైందని ఝు ఝురున్ ధ్వజమెత్తారు. చైనా నిర్లక్ష్యం కారణంగా కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మానవ మనుగడనే సవాల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. చైనాలో మానవ, పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు బహిరంగంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేవారు. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే వారిలో ప్రొఫెసర్ ఝు ఝురున్ ముందువరుసలో ఉంటారు.