ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ టెస్టులను చేస్తున్నప్పటికీ.. వాటి ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుండటంతో.. ర్యాపిడ్ టెస్టులకు తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికేే యాంటీజెన్ టెస్టులను ప్రారంభించగా.. మరో 2 లక్షల ర్యాపిడ్ టెస్టు కిట్‌లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుంటోంది.ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం కోసం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్‌లను ఉపయోగించాలని ఈ నెలారంభంలో ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాలకు సూచించింది. దక్షిణ కొరియా బయోటెక్నాలజీ సంస్థ ఎస్‌డీ బయో‌సెన్సర్ అభివృద్ధి చేసి క్యూ కోవిడ్-19 ఏజీ ఎస్డీ బయోసెన్సర్ కిట్లను సిఫారసు చేసింది.యాంటీజెన్ టెస్టులను చేయడానికి ప్రత్యేకంగా మెషీన్లు అవసరం లేదు. అర గంటలోనే ఫలితం తెలుసుకునే అవకాశం ఉంది. కరోనా లక్షణాలున్న వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా టెస్టులు చేసి వెంటనే ఫలితం తెలుసుకోవచ్చు. ఒక్కో యాంటీజెన్ కిట్‌ ధర రూ.450-500 వరకు ఉంటుంది.ఈ కిట్లను ఉపయోగించి ఎవరికైనా టెస్టు చేస్తే.. ఫలితం పాజిటివ్ అని తేలితే.. నిర్ధారించుకోవడానికి మరోసారి టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదని ఐసీఎంఆర్ తెలిపింది. లక్షణాలు ఉండి ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ అని ఫలితం వస్తే మాత్రం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య శాఖ అధికారులు ర్యాపిడ్ కిట్లను ఉపయోగించనున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ర్యాపిడ్ కిట్లను ఉపయోగించాలని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటళ్లు.. గుర్తింపు పొందిన ప్రయివేట్ హాస్పిటళ్లలో ర్యాపిడ్ కిట్లను ఉపయోగించొచ్చు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews