ఖైరతాబాద్ లో రెబల్ స్టార్ ఎగబడిన ఫ్యాన్స్

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు భారీగా అక్కడికి తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. మాస్క్‌ ధరించిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫొటోలకు పోజిచ్చారు. ప్రతి ఒక్కరు డార్లింగ్‌తో ఫొటోలు దిగారు. యంగ్‌ హీరోతో దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. గత మార్చిలో విదేశాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ప్రభాస్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ బహిరంగంగా కనిపించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews