కరోనాని జయించిన VH హనుమంతరావు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న వీహెచ్‌, మధుమేహ సమస్యతో బాధపడుతున్నా కేవలం 10 రోజుల్లోనే స్వస్థత పొంది బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జ్‌ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం, సంకల్ప బలమే తనను కరోనా నుంచి కోలుకునేట్లు చేసిందని వీహెచ్‌ పేర్కొన్నారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ చేశారని వెల్లడించారు. కరోనా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న వీహెచ్‌కు జ్వరం, దగ్గు తదితర లక్షణాలు కనిపించడంతో స్వతహాగా వైద్యులైన ఆయన కూతురు, అల్లుడు పరీక్షలు చేయించారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో జూన్‌ 21న వీహెచ్‌, అపోలో ఆస్పత్రిలో చేరారు. వీహెచ్‌ భార్య చంద్రకళకూ పాజిటివ్‌గా రావడంతో ఆమెను అదే ఆస్పత్రిలో చేర్చారు. ఆక్సిజన్‌తో పాటు, జ్వరం, దగ్గు తగ్గేందుకు మందులు వాడటంతో వీహెచ్‌ కోలుకున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews