తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో చిన్నారిని చంపిన దుర్మార్గుడు

ప్రేమానురాగాలు చూపించాల్సిన చిన్నారిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో బాలికను బాలి తీసుకున్నాడు కిరాతకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల ఆద్య కూతురుంది. కల్యాణ్ దంపతులపై కరుణాకర్ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. వారిపై ఉన్న కోపంతో చిన్నారి ఆద్యను చంపేశాడు. సర్జికల్‌ కత్తితో గొంతుకోసి హతమార్చాడు. వీరి ఫ్యామిలీకి కరుణాకర్ పరిచయస్తుడే అని స్థానికులు తెలిపారు. ఆద్య మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కరుణాకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కరుణాకర్ కు బాలిక ఫ్యామిలీకి గొడవలు ఎందుకు వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews