నాటిన ప్రతి మొక్కకు మీ ఇంటి సభ్యుల పేర్లు పెట్టండి -సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్‌ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ పాత అడవులు వచ్చి తీరాలి. ప్రతి ఇంటికి ఆరు చెట్లు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నీళ్ల ట్యాంకర్‌ను ఈ ప్రభుత్వం ఇచ్చిందని, నాటిన మొక్కలను బతికించుకునే బాధ్యత ఎవరికి వారు స్వచ్ఛంధంగా తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రతిగ్రామంలో నర్సరీ ఉందని, దేశంలో ఏరాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదన్నారు. ’92 వేల ఎకరాల అడవిని పోగొట్టుకున్నాం. సినిమా షూటింగులకోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంచుకునేవాళ్లు. గతంలో నర్సాపూర్‌ అడవుల్లో చాలా షూటింగులు జరిగాయి. సమష్టి కృషితోనే ఈ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది. అడవులు కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలి. ఇందులో ప్రజల సహకారం కూడా కావాలి’ అని సీఎం అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి. మొక్క ఎండిపోతే బిడ్డ ఎండిపోయినట్లు అని సెంటిమెంట్‌ క్రియేట్‌ చేయాలని చెప్పారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews