జూబ్లీహిల్స్ పోలీసులు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. యువతులను ఆకర్షిచేందుకు అవని వెల్ నెస్ సెంటర్ పేరు ముసుగులో శైలజ, పరమేశ్వర్ అనే దంపతులు వేశ్య గృహాన్ని నడుపుతూ ఆన్‌లైన్ సెక్స్ బిజినెస్ చేస్తున్నారు. వీరు నార్త్ ఇండియా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ సెక్స్ పై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు యువతులతోపాటు మరో ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.