చైనా కు భారత్ తొలిదెబ్బ

చైనా వస్తువులను బహిష్కరించండి
చైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలు
నాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలి
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు చైనాకు తొలి దెబ్బ
రైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్
బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను కచ్ఛితంగా అమలు చేస్తామని చె ప్పారు. కార్యాలయ వినియోగం కోసం చై నా ఉత్పత్తులను ఎట్టి పరిస్థితులలో ఉపయోగించవద్దని ఆయన తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. మన దేశం పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరును పురస్కరించుకుని ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీపాలు, ఫర్నీచర్ తదితర నాసిరకం చైనా వస్తువుల అక్రమ దిగుమతి పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్) నిబంధనలను చైనా వస్తువుల విషయంలో కచ్ఛితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వివిధ ఉత్పత్తుల కోసం ఇప్పటివరకు 25 వేల ప్రమాణ నిబంధనలను బిఐఎస్ రూపొందించిందని ఆయన చెప్పారు. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి వస్తువులను అక్కడ తనిఖీ చేస్తామని, నాణ్యతగా లేవని మన బాస్మతి బియ్యాన్ని అక్కడ తిరస్కరిస్తారని పాశ్వాన్ అన్నారు. అదే అక్కడి వస్తువులు మన దేశానికి వస్తే వాటి నాణ్యతపై నియంత్రణ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
చైనీస్ ఫుడ్‌ను బహిష్కరిద్దాం: అథావలె
ఇలా ఉండగా మరో కేంద్ర మంత్రి రాందాస్ అథావలె దేశంలో చైనీస్ ఫుడ్ తయారు చేసే, అమ్మే అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేయాలని, చైనాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చైనా నమ్మకద్రోహానికి పాల్పడిందని, చైనాలో తయారయ్యే అన్ని వస్తువులను భారత్ బహిష్కరించాలని పిలుపునిస్తూ గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథావలె ఒక ట్వీట్ చేశారు. చైనీస్ ఆహారాన్ని తయారు చేసే అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను దేశంలో మూసివేయాలని కూడా ఆయన డిమాండు చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews