దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్‌లో గత 24 గంటల్లో 9887 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదేవిధంగా ఈ మహమ్మారి వల్ల కొత్తగా 294 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6642కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 1,15,942 మంది చికిత్స పొందుతుండగా, 1,14,073 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఆరో స్థానంలో ఉన్నది. దేశంలో మృతుల సంఖ్య ఇలాగే కొనసాగితే తొందర్లోనే కెనడాను (7703)ను దాటే అవకాశం ఉన్నది. వారం రోజుల క్రితం తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ కేవలం ఏడు రోజుల వ్యధిలో ఆరో స్థానానికి చేరింది. దేశంలో రికవరీ రేటు శుక్రవారం కంటే కొద్దిగా తగ్గి 48.20 శాతానికి చేరింది. నిన్న ఇది 48.27 శాతం ఉన్నది. అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర (80229) మొదటిస్థానంలో ఉండగా, 28,694 పాజిటివ్ కేసులతో తమిళనాడు, 26,334 కరోనా కేసులతో ఢిల్లీ వరుగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (19094), రాజస్థాన్ (10,084), ఉత్తరప్రదేశ్ (9733), మధ్యప్రదేశ్ (8996), పశ్చిమబెంగాల్ (7303) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.