ఇండియా ను భారత్ అని పిలవాలని సమాహ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.ఇండియా పేరును పరాయి దేశం వాలు పెట్టారని మన భారత దేశాన్ని గ్రీకు వాలు ఇండికా అని పిలిచారని పిటిషనర్ తెలిపారు . భారత్ మాతాకీ జై అనే నినాదం మన స్వతంత్ర సమరానికి నాంది అని పిటిషన్ లో తెలిపారు. కౌన్సిల్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఆర్టికల్ 1 సవరించి దాని నుండి ఇండియా ను తొలగించాలని పిటిషన్ లో కోరారు. వాదనలు విన్న కోర్టు ఇండియా పేరును భారత్ గ మార్చాలన్న పిటిషన్ ను ఒక ప్రతిపాదనగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మంత్రులకు పంపించాలని కోర్టు పేర్కొన్నది. దీని పై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని సిజెఐ బొబ్దే తెలిపారు.