తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్థికమంత్రికి లేఖ రాశారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ పరిహారం రూ.210 చెల్లించాలని కోరారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మద్దతివ్వాలని, 2019-20 సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల కాలేదని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆ తర్వాత నుంచి జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగిందని.. దీంతో వెనుకబడిన జిల్లాల సంఖ్య 9 నుంచి 32కి పెరిగిందని తెలిపారు. ప్రత్యేక ప్రోత్సాహాన్ని మరో ఐదేళ్లు పొడగించి, ప్రస్తుత సంవత్సరంతో పాటు 2019- 20 సంవత్సరానికి సంబంధించిన గ్రాట్‌ను త్వరగా విడుదల చేయాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2020-21 సంవత్సరానికి రూ.723 కోట్లు విడుదల చేయాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు సాంప్రదాయాన్ని, పవిత్రతను కాపాడేందుకు.. గ్రాంట్ ఇవ్వకూడదనే నిర్ణయాన్ని పునః పరిశీలించి గ్రాంట్‌ను త్వరగా విడుదల చేయాలని లేఖలో కోరారు.