హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం అందరికి తెలిసిందే, అయితే దీన్ని పై తెలుగు మీడియా ఓవర్ యాక్షన్ చేయటం పై సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.సాయిధరమ్ తేజ్ వాడిన హెల్మెట్ నుండి బైక్ రేటుతో సహా డిబేట్ లు పెట్టి మినిట్ టూ మినిట్ ఇక వేరే సమస్యలు ఏవి లేనట్టు కేవలం సాయిధరమ్ తేజ్ ది బ్రేకింగ్ న్యూస్ ఇవ్వటం చూస్తుంటే తెలుగు మీడియా కేవలం బలిసిన వారి తరుపున మాత్రమే కానీ సామాన్య ప్రజల తరుపున ఉండదు అని సోషల్ మీడియా లో ఏకిపారేస్తున్నారు. మొన్న సైదాబాద్ సింగరేణి కాలనిలో చిన్నారి పై జరిగిన అఘాయిత్యాని మినిట్ టూ మినిట్ ప్రశ్నిచకుండా కేవలం బైక్ మీద నుండి పడిన ఒక హీరో గురించి ఇంతలా ఓవర్ యాక్షన్ ఎందుకు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
మీడియా తలుచుకుంటే చిన్నారి పై అఘాయిత్యం చేసిన ఆ మూర్కునికి వెంటనే శిక్ష పడేలా చేయొచ్చు కానీ మన తెలుగు మీడియా కి ఇది అంత ముఖ్యం కాదు, సాయిధరంతేజ్ ఎపుడు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా పడ్డాడు బైక్ ఎంత, వాడిన హెల్మెట్ ఎంత, ఇవి మన తెలుగు మీడియా కు ఇప్పుడు చాల ముఖ్యం షేమ్ లెస్ తెలుగు మీడియా అని ప్రజలు అనుకుంటున్నారు . ఇలాంటి తెలుగు న్యూస్ ఛానెల్స్ మనకు ఉండటం సిగ్గుతో తల దించుకోవాల్సిందే అని ప్రజలు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు.