ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఓ అరుదైన వివాహం జరిగింది. ఓ వ్యక్తి తన కొడుకు చనిపోవడంతో అతడి భార్యను వివాహం చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్(22) దంపతులు. గౌతమ్ సింగ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆర్తిసింగ్ రెండు సంవత్సరాలుగా వితంతువుగా ఉంటూ ఒంటరి తనంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఆర్తి సింగ్ రెండేళ్ల నుంచి గౌతమ్ సింగ్ తండ్రి కృష్ణ రాజ్‌పుత్ సింగ్ సమక్షంలో ఉంటుంది. రాజ్‌పుత్ క్షత్రియ మహాసభ సంప్రదాయం ప్రకారం తన మామ ఆర్తిసింగ్ ను వివాహం చేసుకోవాలని పెద్దలు ప్రతిపాదించారు. మహిళల పునర్వివాహాన్ని వారి కమ్యూనిటీలో అనుమతిస్తారు. దీనికి తోడు రెండేళ్లుగా అతడు ఆమెను చూసుకున్న తీరు నచ్చి ఆర్తి సింగ్ సైతం వివాహం చేసుకునేందుకు అంగీకరించింది.రాజ్‌పుత్ క్షత్రియ మహాసభ కమిటీ అధ్యక్షుడు హోరిసింగ్ దౌడ్ సమక్షంలో ఆ సంఘం ప్రతినిధులు కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించి వివాహం చేశారు. ప్రస్తుతం ఈ వివాహం చర్చనీయాంశమైంది.