తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ కు కరోనా సెగ తగిలింది.. ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు..కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితులను హోం క్వారంటైన్ లో ఉంచారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఉందని తేలడంతో..అధికారులు, వైద్య సిబ్బంది ప్రగతి భవన్ ను శానిటైజ్ చేశారు.కాగా ప్రగతి భవన్ లో నివాసముంటున్న కెసిఆర్ తన నివాసాన్ని గజ్వల్లోని తన ఫామ్ హౌజ్ కి మార్చారు.. అక్కడ నుంచి ఆయన అధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు..