ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తన అనుచరులతో చాలా ముఖ్యమైన సందేశాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇటీవల ఒక పోస్ట్ షేర్ చేశారు. అందుకు సోనమ్ కపూర్‌తో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఒకరినొకరు బెదిరించుకోవడం, ఒకరిపై ద్వేషాలు చూపడం లాంటివి ఆపాలని కోరారు. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలని అభ్యర్థించారు. ‘కరోనా మహమ్మారితో ఈ ఏడాది పరిస్థితులు అసలే బాగోలేవు. ఈ సమయంలో ప్రతిఒక్కరూ ఐకమత్యంగా సహాయకారిగా ఉండాలనుకుంటున్నాను. ఒకరిని కిందికి లాగేయడానికి ఇది సమయం కాదు. ప్రతిఒక్కరూ సన్నిహితంగా ఉండాలి. దయ, జాలి, సహనం, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం’ అనే సందేశంతో పోస్ట్ చేశారు. ఇది ఎక్కుమందికి సహాయపడుతుందనే అశతో పోస్ట్‌ను ముగించారు రతన్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇటీవల ఆన్‌లైన్‌లో భారీగా బెదిరింపులకు గురైన సోనమ్ కపూర్ కూడా ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. ఆమె హార్ట్ ఎమోజితోపాటు “ఆమేన్” అని రాశారు.