బొంరాస్ పేట్: మండలం లోని యువకుడి హాత్మహత్య కలకలం సృష్టిస్తుంది. యువత క్షణ పాటి ఆవేశంతో తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. మండలం లోని శివ (19 ) అనే యువకుడు పొలం లోని చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట శ్రీను తెలిపారు. తన తండ్రి మల్లేశం శివని ఏదైనా పని చేసుకోమని మందలిచినట్టు తెలుస్తుంది. కేవలం తన తండ్రి మందలించాడనే కోపంతో శుక్రవారం రాత్రి తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు. క్షణిక ఆవేశంతో పొలంలో ఉరేసుకున్నట్టు శనివారం గ్రామస్థులు గుర్తించారు. తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.నేటి యువత ప్రతి చిన్న సమస్యకు చావే పరిష్కారం అని క్షణిక ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తననే నమ్ముకున్న వారి కుటుంబాలని తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.