హైదరాబాద్ : కొడంగల్ లో రేవంత్ రెడ్డి అనూహ్య పరాభవం తర్వాత ప్రజల మద్యకు వచ్చిన ధాఖలాలు లేవు. ఓటమి పట్ల రేవంత్ రెడ్డి లోతుగా సమీక్ష జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒక ఓటమి వంద విజయాలకు బాట వేస్తుందన్నట్టు తర్వాత కార్యాచరణ పై రేవంత్ రెడ్డి ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ అండదండలు మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కీలక బాద్యతలు పోషించబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.