గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్‌లోని కోఠిలో గోకుల్ చాట్ యజమాని విజయ వర్ఘీ (72)కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది గోకుల్ చాట్ సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత 3 రోజులుగా షాప్‌కు ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, జంట నగరాల పరిధిలో గోకుల్ చాలా ఫేమస్ కాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 5వేలు దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 2766 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 187కి చేరింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews