కొత్త సంవత్సరం వేడుకలు తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టులో పిటిషన్

కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ పిటిషన్‌లో పేర్కొని ఉంది. ఇతర రాష్ట్రల మాదిరి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా ప్యాండమిక్, ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ విన్నవించారు. పెరిగిపోతున్న ఒమిక్రాన్‌ కేసుల్ని కట్టడి చేయకుండా.. ఇష్టానుసారంగా టీ సర్కార్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న పిటిషనర్‌.. తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు నమోదయిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ప్రస్తావించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఉత్తర్వులను వెనక్కి తీసుకుని.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఇక పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. రేపు(గురువారం) విచారిస్తామని పిటిషనర్‌కి తెలిపింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews