రేవంత్ రెడ్డి కి రాఖి కట్టిన సీతక్క

రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.. ఈ సందర్బంగా నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టిన సీతక్క మాస్కు, శానిటైజర్ బహూకరించారు. రేవంత్ కు మిఠాయి తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆమెతో పాటు పలువురు మహిళా నేతలు కూడా రేవంత్‌కి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో రేవంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews