కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం

ప్రగతి భవన్ లో కొడంగల్ అభివృద్ధి పై సంబంధిత ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఎన్నికల సమయంలో కొడంగల్ లో పర్యటించిన కేటీఆర్ తెరాస అబ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ దత్తత తీసుకోని కొడంగల్ అబివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే .అందులో భాగంగానే కొడంగల్ సమస్యల పై కొడంగల్ ఎమ్మెల్యే అయినా పట్నం నరేందర్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం, అలాగే డిగ్రీ మరియు గురుకుల పాఠశాల దౌల్తాబాద్ లో మినీ ట్యాంక్ బండ్ పనులను వేగవంతం చేయాలనీ మరియు కొడంగల్ కోస్గిలో వైద్యశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిని కోరారు , సెప్టెంబర్ లో కొడంగల్ పర్యటిస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ,సబితా ఇంద్ర రెడ్డి , ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews