Instagram చూసి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్

అదృష్టం ఒక్కొక్కరిని ఒక్కోలా పలుకరిస్తుంది.సోషల్‌ మీడియా పుణ్యాన చాలామంది
సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌ద్వారా హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసి, ‘అర్థశతాబ్దం’
సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృష్ణప్రియ.
చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం. అన్ని భాషల చిత్రాలూ చూసేదాన్ని. హీరోయిన్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. డాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు, డాన్స్‌ వీడియోలు చూసి ‘అర్ధ శతాబ్దం’ డైరెక్టర్‌ రవీంద్ర కాంటాక్ట్‌ చేశారు. సినిమాలో హీరోయిన్‌ చాన్స్‌ అనగానే వెంటనే ఒప్పుకొన్నా. కథకూడా నచ్చింది. తెలుగు రాదని మొదట్లో భయపడినా సెట్లో అందర్నీ చూసిన తర్వాత రిలీఫ్‌గా ఫీలయ్యా.మొదటి సినిమాలోనే పెద్ద నటులతో కలిసి నటించే అవకాశం లభించింది. సాయికుమార్‌,శుభలేఖ సుధాకర్‌, పార్వతీ లోకేష్‌, ఆమని, శరణ్య.. ఇలా అనుభవం ఉన్నవాళ్లతో కలిసి పనిచేశా. నటనలో ఎటువంటి శిక్షణా తీసుకోని నాకు సినిమా సెట్‌ శిక్షణ కేంద్రంగా ఉపయోగపడింది. ‘టేక్‌ రెడీ’ అనగానే వాళ్ళు పాత్రలో లీనమయ్యే విధానం నుంచి కూడా చాలా నేర్చుకున్నా.నేను పుట్టి పెరిగిందంతా కేరళలో. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్నా. మొదటి సినిమాలోనే నా జీవితానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్రలో నటించా. లంగా వోణీలో తెలంగాణ అమ్మాయిలా కనిపించడం నాకే థ్రిల్లింగ్‌గా అనిపించింది. మా కుటుంబసభ్యులే కాదు, చాలామంది నా లుక్స్‌కు ఫిదా అయ్యారు. తొలి సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం
ఆనందంగా ఉంది.ఎంతైనా కొత్తమ్మాయిని కదా! ఎక్కడా భయపడకుండా అందరూ బాగా చూసుకున్నారు. ముఖ్యంగా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, హీరో కార్తీక్‌ చాలా సపోర్ట్‌ చేశారు. ప్రతి డైలాగ్‌ నాకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా నేను కాస్త తడబడినట్లు కనిపిస్తే వెంటనే ధైర్యం చెప్పేవాళ్ళు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఏడ్చేదాన్ని.
తెలుగు పరిశ్రమతోపాటు ప్రేక్షకులుకూడా నచ్చారు. సినిమా రిలీజైనప్పటినుంచీ చాలామంది కాల్స్‌, మెసేజెస్‌ చేస్తూ మెచ్చుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. నా నటన బాగుందన్న టాక్‌ సోషల్‌ మీడియాలోనూ వినిపిస్తున్నది. సినిమాల్లోనే కొనసాగమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక్క
సినిమాకే ఇంతలా ఆదరిస్తున్న అభిమానులను చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తున్నది.
అవకాశాలు మంచివైతే అస్సలు వదులుకోను. చదువు పూర్తయ్యాక మాత్రం మొత్తంగా సినిమాపైనే దృష్టి పెడతాను. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించాలని ఉంది. మొదటినుంచే కమర్షియల్‌ చిత్రాలు కాకుండా కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews