ప్రధాని మోడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ’మన్ బైరాగి.‘ ఈ సినిమాను ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోడీ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ తెలుగు వెర్ష‌న్ ’మనో విరాగి‘ పోస్ట‌ర్ ను గురువారం విడుదల చేశారు. పోస్ట‌ర్ లో ఓ వైపు మోడీ యువ‌కుడి లుక్ , మరోవైపు ఓ వ్య‌క్తి బ్యాగు వేసుకుని మ‌ట్టి రోడ్డుపై నుంచి న‌డుచుకుంటూ వస్తూ కనిపిస్తున్నాడు. ప్రధాని మోడీ గురించి తెలియని విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ ఫస్ట్ లుక్ ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆవిష్కరించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews