సీరియల్స్ లో నటించటం లేదు -బ్రహ్మనందం

తనకు టివి సీరియళ్లలో నటించే ఆలోచన లేదని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తేల్చి చెప్పారు. బ్రహ్మానందం టివి సీరియళ్లలో నటించనున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు. ఇటీవలే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాను ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నానని, తన మనవడితో ఆడుకుంటూ, పుస్తకాలు చదువుతూ, డ్రాయింగ్ వేస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తాను టివి సీరియళ్లలో నటించనున్నట్టు పుకార్లు పుట్టించవద్దని, అటువంటి ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ప్రశాంత జీవితం గడుపుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కెరీర్ గురించి ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. తాను సీరియళ్లలో నటించనున్నట్టు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన తన అభిమానులను కోరారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews