కొడంగల్ తాండూర్ రాకపోకలకు అంతరాయం

గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్‌-తాండూర్‌ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుని పోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాల్లో భారీగా వర్షం కురవడం వరద ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews