కోడి గుడ్డు మీద ఈకలు పీకోద్దు – హరీష్ రావు

కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తూ.. ప్రతి పక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయన ఘాటుగా విమర్శించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయం మరిచిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సారెస్పీ ఓపెన్ చేసినప్పుడు కూడా 131, 118 కిలో మీటర్ల వద్ద కాలువ బ్రీచ్ అయ్యింది.ఖమ్మం జిల్లాలో పాలెం వాగు ప్రాజెక్టు 2007 లో కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రెడీ కాకముందే కొట్టుకు పోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు మంత్రులుగా ఉత్తమ్, పొన్నాల ఉన్నారనే విషయం మరువొద్దన్నారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాలువలకు కూడా 200 సార్లు గండి పడిందని, ఇటీవలే మనోహరాబాద్ లో కురిసిన వర్షానికి రైల్వే లైన్ తెగి కొట్టుకుని పోయిందని తెలిపారు. దీనికి కారణం ప్రధానమంత్రి అని మేం అంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు.కాంగ్రెస్ హయాంలో నీరు, కరెంట్ ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టారు. అసాధ్యం అనుకున్న గోదావరి నీళ్లు తెచ్చి సుసాధ్యంగా రైతులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. కొండపోచమ్మ సాగర్ కు వచ్చి కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ ఆ నీరు నెత్తి మీద పోసుకొని.. చేసిన తప్పులను ఒప్పుకొని కొండ పోచమ్మకు దండం పెట్టండని సూచించారు. సలహాలు ఉంటే ఇవ్వండి. కానీ బురద చల్లి పోవాలని చూస్తే సహించేది లేదన్నారు. రెండు రోజుల్లో పనులు పూర్తయి యథావిధిగా నీళ్లు వస్తాయన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews