భారత్ ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా ప్లాన్

గల్వాన్‌ లోయలో తమ సేనలను ముందుకు రానీయకుండా అడ్డుకొని అంతర్జాతీయ సమాజం దృష్టి పడేట్లుగా చేసిన భారత్‌పై ప్రతీకారానికి చైనా సిద్ధమవుతున్నది. భారత్‌ను ఏకాకిగా చేసి వారి ఆటలు నడిపించుకొనేందుకు చైనా మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో జత కట్టిన చైనా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు సిద్ధపడింది. ఇందుకు బంగ్లాదేశ్‌కు లాభపడేలా వారం క్రితం చైనా తీసుకొన్న నిర్ణయమే తార్కాణం. రాజ్యవిస్తరణ కాంక్షత రగిలిపోతున్న చైనా.. భారత్‌కు చెందిన లడఖ్‌లోని గల్వాన్‌ లోయను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా గల్వాన్‌ నదికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టుగా అమెరికాకు చెందిన ఓ సంస్థ తీసిన శాటిలైట్‌ ఫొటోలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తమ సైన్యాన్ని అడ్డుకొన్నందుకు ఆగ్రహంతో ఉన్న చైనా.. భారత్‌కు పొరుగు దేశమైన బంగ్లదేశ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. వారికి ఆర్థికంగా లాభం చేకూర్చేలా 5,161 వస్తువుల ధరల్ని తగ్గిస్తూ చైనా ప్రభుత్వం గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన మరుసటి రోజునే నిర్ణయం తీసుకొన్నది. తమ విజ్ఞప్తి మేరకే 5,161 వస్తువుల ధరలను తగ్గిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆసియా-పసిఫిక్‌ ఒప్పందం ప్రకారం 3,095ఉత్పత్తులపై సుంకం లేని వాణిజ్య ప్రయోజనానికి ప్రస్తుత జాబితాను జతచేసినట్లు తెలుస్తున్నది.
తమ సరళ ఆర్థిక వాణిజ్య విధానాలతో బంగ్లాదేశ్‌ను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని చైనా చూస్తున్నది. గత కొన్నేండ్ల క్రితం వరకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపిన బంగ్లాదేశ్‌.. తమ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చైనాకు వంతపాడాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నార్సీ, పౌరసత్వ చట్ట సవరణలపై మండిపడుతున్న బంగ్లాదేశ్‌.. గల్వాన్‌ లోయ ఘర్షణను తమకు అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నం చేస్తున్నదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews