తమిళనాడులో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ సోమవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, చంగల్‌పట్టు, తిరువెళ్లూర్‌లో జిల్లాలో ఈనెల 19నుంచి 30 వరకు లాక్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి 2గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అత్యవరస పరిస్థితుల్లో మాత్రమే ఆటోలు, టాక్సీలకు అనుమతి ఉంటుందని సూచించింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews