దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానం

బాహుబలి’ సినిమా సాధించిన అఖండ విజయం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. పాన్‌ఇండియా హీరోగా ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. సోషల్‌మీడియాలో అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కోటి నలభైలక్షలు (14మిలియన్లు) దాటింది. ఈ రికార్డుతో ఆయన దక్షిణాది హీరోలందరిలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్‌ తర్వాత అల్లు అర్జున్‌ కోటి 31లక్షల ఫాలోవర్స్‌తో ద్వితీయ స్థానంలో ఉన్నారు.
‘బాహుబలి’ ‘సాహో’ సినిమాలతో ప్రభాస్‌ ఫ్యాన్‌ఫాలోయింగ్‌ అనూహ్యంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ పీరియాడిక్‌ సినిమాలో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. కొంతభాగం చిత్రీకరణ పూర్తయింది. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఓ డియర్‌’ ‘రాధేశ్యామ్‌’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews