అంగన్ వాడి కేంద్రాలు సక్రమంగా ఉండాలి

బొంరాస్‌పేట : అంగన్‌వాడీ కేంద్రాలను టీచర్లు సక్రమంగా నిర్వహించాలని వికారాబాద్‌ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి అన్నారు. శనివారం బొంరాస్‌పేటలోని నాలుగు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆమె బియ్యం, పప్పు, నూనె, బాలామృతంతో కూడిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కేంద్రాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని, కేంద్రాలకు చిన్నారులు రెగ్యులర్‌గా వచ్చేలా చూడాలని టీచర్లను ఆదేశించారు. కొడంగల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో ఉన్న 200 కేంద్రాల స్థితిగతులను సీడీపీవో జయరాంనాయక్‌ లలితకుమారికి వివరించారు. బొంరాస్‌పేట మండలంలోని కేంద్రాల నిర్వహణ, టీచర్ల పని తీరు బాగుందని సీడీపీవో వివరించారు. చిన్నారులకు పౌష్టికాహారం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారని టీచర్లను ప్రశ్నించగా రెండు రోజుల నుంచి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రం బాగుందని అన్నీ ఇలాగే ఉన్నాయా అని సీడీపీవోను ప్రశ్నించగా అద్దె భవనాల్లో ఉన్న కొన్ని కేంద్రాలు తప్ప మిగతావన్నీ బాగున్నాయని జయరాంనాయక్‌ చెప్పారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు కల్పన, వెంకటమ్మ, షాహీన్‌బేగం పాల్గొన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews