RRR షూటింగ్ ప్రారంభం కాబోతుంది ?

హైదరాబాద్ : కరోనా వలన సినిమా షూటింగ్ ,సీరియల్స్ అన్ని కూడా మూతపడ్డాయి . అన్ని రాష్టాల్లో ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందికి గురైనారు. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ లు ప్రారంభం కాబోతున్నాయని సినీవర్గాల సమాచారం . ఇప్పటికే అన్ని రాష్టాల్లో దాదాపుగా సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి . అయితే కరోనా సూచనలను పాటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ కూడా షూటింగ్ లు ప్రారంభించాలని ఆలోచిస్తున్నాయి . అందుకు తగ్గట్టే సినీ పెద్దలు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఉతర్వులు అందిన వెంటనే సినిమా షూటింగ్ లు మొదలుకానున్నాయి.
ఇక RRR విషయానికి వస్తే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే కరోనా సూచనలు పాటిస్తూ షూటింగ్ ప్రారంభించాలని రాజమౌళి కార్యాచరణ కూడా రూపొందించాడట . అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సంక్రాంతికి విడుదల చేయాలనీ భావిస్తున్నారట .

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews