100 కోట్లు అయినా వద్దు అతనే కావాలి ఒక సామాన్యుని ప్రేమించిన యువరాణి

లక్ష్మీదేవి తలుపు తడితే ఎవ్వరైనా వద్దంటారా? కానీ.. ఈమె మాత్రం వద్దనుకుంది. వదిలేసుకుంది. తనకు డబ్బులు అవసరం లేదు.. తను మనసు పడ్డ వ్యక్తే కావాలి.. అని అతడిని మనువాడటానికి సై అంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు. జపాన్ దేశపు యువరాణి. ప్రిన్సెస్ మాకో. తను ఎవరో కాదు.. జపాన్ రాజు అకిషినో కూతురు.ప్రిన్సెస్ మాకో.. ఒక సాధారణ వ్యక్తిని ప్రేమించడం.. జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన కూతురు ఒక సాధారణ వ్యక్తిని ప్రేమించినా వాళ్ల ప్రేమను అకిషినో అంగీకరించాడు. దీంతో వాళ్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని అంతా ఎదురు చూశారు. జపాన్ సోషల్ మీడియాలో కూడా గత సంవత్సరం నుంచి వీళ్ల గురించే చర్చ.చివరకు వాళ్ల పెళ్లికి అంతా సిద్ధమైంది. త్వరలోనే ప్రిన్సెస్ మాకో.. తను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్న కెయ్ కొమురోను పెళ్లి చేసుకోబోతోంది. సంప్రదాయ పద్ధతిలోనే తమ పెళ్లి జరుగుతుందని ప్రిన్సెస్ మాకో ప్రకటించింది. కాకపోతే.. సంప్రదాయ పద్ధతితో పాటు.. రాజకుటుంబ ట్రెడిషన్‌లోనూ పెళ్లి జరగనుంది.
అయితే.. ఇక్కడ హాట్ టాపిక్ వాళ్ల పెళ్లి కన్నా.. ఇంకో విషయం మీదికి మళ్లింది. అదే. తనకు వచ్చే రాయల్టీ. జపాన్.. రాజకుటుంబం ఆచారం ప్రకారం.. ఎవరైనా యువరాణి.. ఒక సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. వాళ్లకు రాయల్టీ కింద కొంత డబ్బును ఇస్తారు. అది ఎంత అనేది రాజకుటుంబ పెద్ద డిసైడ్ చేస్తారు. తాజాగా.. ప్రిన్సెస్ మాకోకు కూడా 1.2 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ డబ్బును ఇచ్చేందుకు రాజకుటుంబం ఒప్పుకున్నా.. మాకో మాత్రం తనకు ఆ రాయల్టీ డబ్బు వద్దంటూ రిజెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు 9 కోట్ల రూపాయలు. ఇదే ప్రస్తుతం జపాన్‌లో హాట్ టాపిక్ అయింది. అలాగే.. జపాన్ రాజకుటుంబ సామ్రాజ్య వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. ఒక సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. యువరాణి టైటిల్‌ను కోల్పోవాలి.
ఇలా.. అన్నింటికీ సిద్ధపడి 29 ఏళ్ల ప్రిన్సెస్ మాకో.. తన ప్రియుడు కొమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది.మాకోకు తమ్ముడు ప్రిన్స్ హిషాహిటో ఉన్నాడు. అతడి వయసు 14 ఏళ్లు. ప్రస్తుతానికి జపాన్ యువరాజు అయ్యే చాన్స్ ఉన్న వ్యక్తి ఇతడే. ఎందుకంటే.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకునే యువరాణులకు సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews