తెలంగాణ PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి , ఇదిగో రేవంత్ రెడ్డి టీమ్ మరియు నేపథ్యం

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్‌గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి.కుమార్‌రావు, జావేద్ అమీర్‌లను నియమించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీగౌడ్, కన్వీనర్‌గా సయ్యద్ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర సి రాజనర్సింహయ్య, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఆలే మహేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకోలేక, ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోలేక వరుస వైఫల్యాలను చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించడంతో పాటు పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు యువ నాయకత్వం అత్యవసరమని సోనియా, రాహుల్‌లు భావించారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో హైకమాండ్ కసరత్తు చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ టిపిసిసి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనేదానిపై దాదాపుగా 150 మందికి పైగా నేతల వద్ద నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో బయటి నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తికి, కేసులున్న వారికి టిపిసిసి పదవి ఎట్లా కట్టబెడతారని ఓ సీనియర్ నేత బాహాటంగానే ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆది నుంచి రేవంత్‌రెడ్డి సారథ్యంపైనే మొగ్గుచూపుతూ వచ్చింది. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ తాను టిపిసిసి అధ్యక్షుడయ్యే అవకాశం ఉండదని భావించిన కోమటిరెడ్డి సైతం హస్తినలో చివరికంటా తనదైన శైలిలో లాబీయింగ్ చేశారు. చివరికంటా రేసులో రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లే మిగిలాయి. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎఐసిసిలో మంచి ప్రాధాన్యత ఉన్న పదవిని హైకమాండ్ ఇవ్వనున్నట్లు

నేపథ్యమిది…
ఉస్మానియా ఎ.వి.కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ను ఎనుముల రేవంత్‌రెడ్డి పూర్తి చేశారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్‌పిటిసిగా గెలుపొందారు. అనంతరం జెడ్‌పిటిసి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 20072009లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంఎల్‌సిగా ఉన్నారు. 20092014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొడంగల్ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. 2014-2017లో ఎంఎల్‌ఎ, టిడిపి టిఎస్ తెలంగాణ శాసనసభ పక్షనేతగా కొనసాగారు. అక్టోబర్ 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2019 మేలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 13 సెప్టెంబర్ 2019 నుండి రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ, వాతావరణ మార్పు కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews