ఈటల చూపు బీజేపీ వైపేనా ? బీజేపీ నుండి ఈటలకు ఆహ్వానం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి బీజం పడింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లు ఈటలతో భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారం. కలిసి పోరాటం చేద్దామని ఈటలను బీజేపీ నేతలు కోరారని, అయితే నిర్ణయాన్ని అనుచరులతో చర్చించిన తర్వాతే వెల్లడిస్తానని ఈటల చెప్పినట్లు తెలుస్తోంది.కాగా, రెండురోజుల క్రితం డీకే అరుణ, జితేందర్‌రెడ్డితో ఈటల భేటీ అయ్యారు. ప్రస్తుత భేటీలో జితేందర్‌ రెడ్డి, వివేక్‌, డీకే అరుణ సహా మరో మాజీ ఎంపీ, ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. నగర శివారులోని ఫామ్‌హౌజ్‌లో ఓ జాతీయ నేత సమక్షంలో జరిగిన భేటీలో బీజేపీలోకి రావాలని ఈటలకు ఆహ్వానం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే చేరికపై ఆయన తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. కాగా, ఈటల రాజేందర్​పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఎప్పటి నుంచో ఈటల కొత్త పార్టీ పెడతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మేరకు ట్విట్టర్‌లోని ఈటల కవర్‌ ఫొటో మార్చడం ద్వారా ఆ సంకేతాలిచ్చారని అభిమానుల్లో చర్చ నడుస్తోంది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews