ఆప్త మిత్రుని కోల్పోయాను -కేసీఆర్

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మ‌ధ్యాహ్నం చిట్టాపూర్‌కు చేరుకున్నారు. అనంత‌రం రామ‌లింగారెడ్డి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పిస్తూ క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే‌ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స‌హా పలువురు ప్రజా ప్రతినిధులు రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews