ధోని నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు -యువరాజ్ సింగ్

తన భవిష్యత్తు గురించిన వాస్తవాన్ని ధోనీ ఎంతో నిజాయతీగా తన కళ్లముందుంచాడని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌చెప్పాడు. క్యాన్సర్‌ను జయించిన తర్వాత 2017లో యువీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ, నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో 2019 వరల్డ్‌కప్‌కు సెలెక్టర్లు తనను పరిగణనలోకి తీసుకోవడం లేదనే వాస్తవాన్ని మహీ తనతో చెప్పినట్టు యువీ తెలిపాడు. ప్రపంచక్‌పకు దారులు మూసుకుపోవడంతో గతేడాది జూన్‌లో యువీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ‘దేశవాళీ క్రికెట్‌లో రాణించా. కానీ ఇంగ్లండ్‌లో వరల్డ్‌క్‌పకు సెలెక్టర్లు నన్ను పరిగణించడం లేదనే వాస్తవాన్ని ధోనీ తెలియజెప్పాడు. అతను చేయదగినది చేశాడు. కానీ, కెప్టెన్‌గా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయలేడు కదా’ అని యువీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews