రోహిత్ శర్మ కు బౌలింగ్ చేయటం చాల కష్టం

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్​ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన బ్యాట్స్​మన్ అని, అతడికి బౌలింగ్ చేయడం చాలా సవాల్​గా అనిపించిందని గురువారం ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. అలాగే డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ కూడా గొప్ప ఆటగాళ్లంటూ చెప్పుకొచ్చాడు. తాను బౌలింగ్ చేసేందుకు సవాల్​గా అనిపించిన బ్యాట్స్​మెన్ ఎవరు అని అడిగిన ఓ ప్రశ్నకు ఫెర్గూసన్​ సమాధానం ఇచ్చాడు.“కొందరు ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం బాగా సవాల్​గా అనిపిస్తుంది. అతడిని త్వరగా ఔట్ చేయలేకపోతే, భారీగా బాదేస్తాడు. లెంగ్త్​ను త్వరగా పసిగడతాడు. అతడో వరల్డ్​ క్లాస్ ప్లేయర్​. స్టీవ్​ స్మిత్, డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఆటగాళ్లు. వారికి బౌలింగ్ చేయడం ఎప్పుడైనా కష్టమే. అయితే టాపార్డర్​లో ఉన్న వారిని ఔట్ చేయడం బాగా అనిపిస్తుంది. టాపార్డర్​ను పెవిలియన్​కు పంపితేనే మిడిల్​ ఆర్డర్​, లోయరార్డర్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం వస్తుంది కదా” అని ఫెర్గూసన్ చెప్పాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews