ఆఫ్గానిస్థాన్ పై పాకిస్థాన్ దాడులు ప్రతీకార చర్యకు ఆఫ్గానిస్థాన్ వ్యూహాలు

దాయాది పాకిస్తాన్‌ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించింది. పొరుగు దేశం అఫ్గానిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం విచక్షణ రహితంగా దాడులకు తెగబడింది. కందహార్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ బోల్డాక్‌ జిల్లాలోని నివాస ప్రాంతాలపై జరిగిన ఈ ఫిరంగి దాడుల్లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు, 50 మంది గాయపడ్డారని ఆప్ఘనిస్తాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు సాక్షులు పేర్కొన్నారు.దీంతో పాకిస్తాన్‌పై ప్రతిదాడి చర్యలకు సిద్ధంగా ఉండాలని అఫ్ఘన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ యాసిన్ జియా పిలుపు నిచ్చారు. అలాగే ఇందుకు పాక్‌- అఫ్గాన్‌‌సరిహద్దు ప్రాంతం డురాండ్‌ లైన్‌ వద్ద దేశ సైనిక దళాలను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. కాగా కొన్ని సంవత్సరాలుగా పాక్‌ సైనిక దళాలు అఫ్గానిస్తాన్‌ తూర్పు, దక్షిణ భాగాలపై ఫిరంగి దాడులకు పాల్పడుతున్నాయని నిరూపించడానికి అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ పాక్‌ మాత్రం వీటిని ఖండిస్తూనే ఉంది

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews