కరోనా గుడ్ న్యూస్ రష్యా వాక్సిన్ రాబోతుంది

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌గా కూడా పేర్కొనవచ్చు. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం మాస్కోలోని గమలేయ ఇన్‌స్టిట్యూట్ మరియు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేత అభివృద్ధి చేయబడిన ఔషధాన్ని.. రెగ్యులేటర్లు ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన మూడు నుండి ఏడు రోజులలోపు పౌర(ప్రజలు వాడేందుకు) ఉపయోగం కోసం ఆమోదించవచ్చు అని ఈ ప్రక్రియ గురించి తెలిసిన ఒక వ్యక్తి తెలిపాడు. అంతకుముందు, ఆగస్టు 15-16 నాటికి వ్యాక్సిన్‌ను ఆమోదించవచ్చని రష్యా ప్రభుత్వ నిర్వహణలోని ర్‌ఐఎ నోవోస్తిన్యూస్ సర్వీస్ తెలిపింది. అంతేకాకుండా, రష్యా స్టేట్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ దేశపు రెండవ పొటెన్షియల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయిల్స్‌ను ప్రారంభించింది. మరోవైపు, బ్రిటీష్ ఫార్మాస్యూటికల్స్ దిగ్గజం ఆక్‌సఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి రష్యా ఔ షధ తయారీదారు ఆర్-ఫార్మ్ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా మద్దతు ఉన్న హ్యాకర్లు కోవిడ్ -19 వ్యాక్సిన్, చికిత్స పరిశోధనలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యుకె, కెనడా , అమెరికాల నుండి వచ్చిన ఆరోపణల తరువాత, రష్య్కా సంపద నిధి (వెల్త్‌ఫండ్) అధిపతి..ఈ ఒప్పందం మాస్కోకు దొంగిలించాల్సిన అవసరం లేదని ఈ డీల్ చెబుతోందని అన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews