వెబ్ సిరీస్ లో నటించటానికి ఒప్పేసుకున్న సాయిపల్లవి

వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పిందట హీరోయిన్ సాయిపల్లవి. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేయనున్న వెబ్ సీరీస్ లో సాయి నటిస్తోంది. ఇందులో ఆమె తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తుండడం మరో విశేషం. మామూలుగా కథ నచ్చనిదే సినిమాలే ఒప్పుకోని సాయిపల్లవి ఇప్పుడు వెబ్ సీరీస్ చేయడానికి కూడా ఒప్పుకుందంటే, ఇది కచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో వస్తున్నదే అయివుంటుందని టాక్. ఆనర్ కిల్లింగ్స్ (పరువు హత్యలు) నేపథ్యంలో ఈ సీరీస్ రూపొందుతుందట . నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఈ సీరీస్ త్వరలోనే షూటింగును ప్రారంభించుకుంటుందట.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews