బిచ్చగాడు కు సీక్వెల్ గా బిచ్చగాడు-2 చిత్రం

విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ సాధించి తెలుగు ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. జూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌గా ‘బిచ్చ‌గాడు 2’ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విజయ్ ఆంటోని నిర్మాత‌గా తమిళంలో ‘పిచ్చైకారన్’, తెలుగులో ‘బిచ్చగాడు2’ రూపొందనున్న ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియా కృష్ణ‌స్వామి డైరెక్ట్ చేయనున్నారు. 2021లో ఈ సీక్వెల్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews