కేంద్రం నియమించిన ఐజిఎస్టి సెటిల్మెంట్ కమిటీలో హరీష్ రావు

కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ వ్యవహారించనున్నారు. సభ్యులుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఛత్తీస్ గఢ్‌, ఒడిసా, పంజాబ్‌, తమిళనాడు మంత్రులు టీస్‌ సింగ్‌, నిరంజన్‌ పుజారి, మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, జయకుమార్‌ ను నియమించారు. కాగా, ఐజీఎస్టీ కింద తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.2,800 కోట్లు రావాల్సి ఉంది. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా నియమించడంతో, ఆ నిధులను రాబట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews