కరీంనగర్ శుద్ధమైన నీటికోసం 110 కోట్లతో ఏర్పాటు చేసిన రిజర్వాయిర్ ను ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్‌ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కరీంనగర్‌ పట్టణంలో ప్రతి రోజు మంచి నీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుంది. ఏ పని ప్రారంభించినా కరీంనగర్‌లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందన్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో 247 వాటర్‌ సైప్లె కూడా కరీంనగర్‌ నుంచే ప్రారంభం కావాలన్నారు. 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రమంత ఈ పథకం ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews